ఘనంగా నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 87వ జయంతి వేడుకలు !!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 87వ జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా స్థానిక ఇందిరాభవన్ లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ జనార్ధన్ రెడ్డి అన్నీ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన నాయకుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా రాష్ట్రానికి పట్టాదారు పాసు పుస్తకాలు చట్టాన్ని తీసుకువచ్చి భూఅక్రమాలకు అడ్డుకట్ట వేసిన వ్యక్తి నేదురుమల్లి.జనార్ధన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జీ షేక్.ఫయాజ్,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్.అల్లావుద్దీన్,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పర్తి.గణేష్ బాబు,డీసీసీ ప్రధాన కార్యదర్శులు షేక్.హుస్సేన్ బాషా,మావులూరు.సురేష్ బాబు,ఆరవ.రామ్మోహన్ రావు,ఎన్.రాజేష్ రెడ్డి,మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్.రెహమాన్,మహ్మద్.సర్ఫరాజ్ షబ్బీర్,షేక్.రహ్మతుల్లా,షేక్.ఫాజిల్,హాజీ.హనీఫ్, షేక్.ఆబిద్ తదితరులు పాల్గొన్నారు.