తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది-మోదీ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తమిళం ఎంతో అందమైన భాష.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాషల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. అలాంటి గొప్ప తమిళ భాషను నేర్చుకోలేకపోయానని బాధగా ఉందని పశ్చాత్తాపం తెలియజేశారు. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తమిళ భాషను, సాహిత్యాన్ని తెగ పొగిడేశారు.

ఇన్నేళ్లు సీఎంగా, ప్రధానిగా పనిచేసిన సమయంలో ఏదైనా చేయాలేకపోయానని ఫీలవుతున్నారా? అని అపర్ణా రెడ్డి అనే శ్రోత అడిగిందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించా. తమిళ భాష గొప్పతనం, తమిళ సాహిత్య విశిష్టత గురించి నాకు ఎంతోమంది చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన తమిళ భాషను నేర్చుకోనందుకు చాలా బాధగా ఉంది.’ అని మోదీ అన్నారు.

గతంలోనూ తమిళ భాష గురించి ప్రధాన మోదీ ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలోనూ పలుసార్లు తమిళ సూక్తులను మోదీ ఉపయోగించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా తమిళ సాహితీవేత్త కనియన్ పుంగుండ్రనార్ గురించి ప్రస్తావించారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వేళ.. తమిళ భాషను ప్రశంసించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *