మొదలైన నాగ్, ప్రవీణ్ సత్తారు సినిమా!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–అక్కినేని నాగార్జున అటు ‘బ్రహ్మస్త్ర’ షూటింగ్ పూర్తి చేసుకున్నారో లేదో ఇటు వెంటనే కొత్త తెలుగు సినిమా షూటింగ్ కు శ్రీకారం చుట్టేశారు. నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ కు రెడీ అయిన క్రమంలో ఆయన ఇప్పుడు దృష్టి అంతా న్యూ మూవీ మీద పెట్టారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు మంగళవారం సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.