ఫిట్స్ తో బాధపడుతున్న మహిళకు అరుదైన శస్త్రచికిత్సతో నయం చేసిన మెడికవర్ వైద్యులు!!

Times of Nellore –కోట సునీల్ కుమార్
–20 ఏళ్లుగా ఫిట్స్ వ్యాధి కారణంగా బాధపడుతున్న మహిళకు అరుదైన శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా నయం చేశామని మెడికవర్ వైద్యులు ప్రముఖ న్యూరోసర్జన్ వెంకటేశ్వర ప్రసన్న తెలిపారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన 30ఏళ్ల మహిళ ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ తమను సంప్రదించారని తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం వ్యాధి బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. అత్యంత క్లిష్టమైన అరుదైన శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించామని తెలిపారు. సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ వంశీమోహన్, యూనిట్ హెడ్ కార్తీక్, హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.