మాకు న్యాయం చెయ్యండి సార్ …. !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో గల 31వ డివిజన్ నందు తమ నానమ్మ గిద్దలూరు కాంతమ్మ కు సర్వే నెంబర్ 2084/2 నందు 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు స్థానికంగా ఉండే పఠాన్ ఆయుబ్ ఖాన్..అతని కుమారుడు ప్రయత్నిస్తున్నట్లు బాధ్యతలు వాపోయారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 47 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మాకు కేటాయించిన నాలుగు ఎకరాల భూమిని మేము నువ్వులు..మినుము పంటలు సాగు చేసుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులానికి చెందిన మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేసి గత మూడు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం రాజకీయ నాయకుల అండదండలతో మా భూమి నందు గుడిసెలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు.నెల్లూరు ఆర్డీవో.. ఎమ్మార్వో..వీఆర్వో స్థలాన్ని పరిశీలించి భూమి తమకు అప్పజెప్పినప్పటికీ కబ్జాదారులు మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేసినట్లు వారు కన్నీరు పెట్టుకున్నారు.జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు..తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చెసుకుంటామని వాపోయారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మా భూములను పరిశీలించి అన్ని విధాలుగా హక్కును కల్పిస్తూ మాకు అప్పగించడం జరిగింది అన్నారు అయినప్పటికీ కబ్జాదారులు మాత్రం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *