జనసేన సబ్యత్వాలు నమోదు కార్యక్రమం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేన పార్టీ క్రియాశీలక సబ్యత్వాలను తీసుకోవాలని ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ కోరారు. కోట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సబ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరు 500 చెల్లించి తప్పనిసరిగా సబ్యత్వం తీసుకోవాలని, సబ్యత్వం ఉన్నవారికి 5 లక్షల ప్రమాద భీమా ఉందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడలనుకునే వారు,భవిష్యత్తు నాయకులుగా ఎదగలనుకునే వారు సబ్యత్వం తీసుకోవాలన్నారు. అనంతరం కోట జనసేన పార్టీ కో ఆర్డినేటర్లు అల్లం బాబు, దామరపు బాల సుబ్రమణ్యంలు మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అభిమానులంతా ముందుకు వచ్చి, సబ్యత్వం తీసుకోవాలని, సబ్యత్వం ఉన్నవారికి మండల కమిటీల్లో ప్రాధాన్యం ఉంటుందని ఈ అవకాశాన్ని అభిమానులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అరవ జగదీష్, చెంగయ్య, రాకేష్, అరవింద్, గణేష్, గంగ, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *