గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీరు లేక విద్యార్థుల కష్టాలు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –గూడూరులోని ఎస్ కే ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి వసతి కల్పించాలని ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన చేసారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని ప్రసిద్ధి చెందినటువంటి ఎస్ కే ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందరో గొప్ప వ్యక్తులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్లారని,ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఎక్కువ మంది చేరడం తో తిరిగి కళాశాల కి వైభవం మళ్లీ వచ్చిందని, కానీ ప్రస్తుతం జూనియర్ కళాశాలలో తాగునీటి వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఇంట్లో కంటే కళాశాలలోని ఎక్కువ సమయం చదువుకుంటూ ఉంటున్న విద్యార్థులకు కనీసం తాగునీరు వసతి లేక అధ్యాపకులు విద్యార్థులు డబ్బులు వేసుకుని తాగు నీరు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. మున్సిపల్ నీరు అందించే పైప్ లైన్ కూడా కట్ చేయడం వల్ల తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే , గూడూరు పట్టణంలోని దాతలు సహకరించి తాగునీరు వసతి కల్పించాలని విద్యార్థులు ఏబీవీపీ నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ చిన్న ఏబీవీపీ ఎస్ కే ఆర్ కళాశాల ప్రెసిడెంట్ మనోజ్ కళాశాల కమిటీ ఏబీవీపీ నాయకులు సుబ్రహ్మణ్యం హరి రసూల్ కిరణ్ మహేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *