డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ డిమాండ్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరంలోని స్థానిక సెంటర్లో వి.ఎస్.యు పరిధిలో జరిగే డిగ్రీ 3 5 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి జయంత్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి వి ఆర్ కళాశాలలో అధ్యాపకులకు లేక వారికి సిలబస్ పూర్తి కాని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అదే విధంగా డిగ్రీ అడ్మిషన్లలో చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్పులు నిలిపివేస్తామని అన్న వ్యాఖ్యలను ఏబీవీపీ ఖండిస్తోంది.పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలని దివంగత నేత డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొని వచ్చారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తండ్రి తెచ్చిన పథకానికి కొడుకు గండి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ మనోహర్, నాయకులు జయంత్, మహేంద్ర, శ్రావణ్, కార్తీక్, తరుణ్ రాజ్, శరణ్, హరి, దుర్గాప్రసాద్, సాహిత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *