స్వరూపానంద ఆశ్రమాన్ని మూసేయండి.. ఎస్ఈసీకి ఫిర్యాదు!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–స్వరూపానంద మఠంపై ఓ వ్యక్తి ఎస్ఈసీని ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఆశ్రమాన్ని మూసివేయాలని విశాఖ వాసి రామ్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వరూపానంద ఓ దొంగ స్వామి అని మండిపడ్డారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని ఆయన తప్పుబట్టారు. భీమిలిలోని 15 పంచాయతీల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని విమర్శించారు. భీమిలిలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరామని రామ్ తెలిపారు.