ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడిచిన వారం రోజులుగా 50-60 కేసులే నమోదుకాగా ఇవాళ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 79 మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌-19 వైరస్‌ బారినపడి చికిత్సకు కోలుకొని 77 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,156 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. 8,81,369 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 620 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,167 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 26,526 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,36,70,612 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *