ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉననతాధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పై ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈడీబీలో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పని చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్య మనుషులకు కూడా అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.