సైన్స్‌ కూడా అంతుచిక్కని ‘పూరీ’ రహస్యం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ప్రతి ఏడాది జరిగే పూరిజగన్నాథ రథోత్సవం చాలా ప్రసిద్ధి ఉంది. కానీ, ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోకతప్పదు.

దేశంలో ప్రసిద్ధిచెందిన చార్‌ధామ్‌ క్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రతిఏటా రథయాత్రకు దేశవిదేశాల నుంచి లక్షాలాది మంది భక్తులు తిలకించడానికి వస్తారు. పాండావులు యమలోకానికి తమ ప్రయాణాన్ని ప్రారంభిచినపుడు మోక్షానికి చేరువ చేసే పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారట. పూరీ జగన్నాధ ఆలయంపై ఎప్పుడూ జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏమంటే గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

ఆలయ పై భాగంలో ఏర్పాటు చేసిన సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు టన్ను బరువు ఉంటుంది. ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిసిస్తుంది. ఏ వైపు నుంచి చూసినా అది మనకు అభిముఖంగానే కనిపిస్తుంది.

ఆలయం పైనుంచి ఏమీ ఎగరవు

ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. ఇటువంటిది అరుదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్‌ జోన్‌గా పరిగణించబడుతుంది.

నిర్మాణం

పూరీ జగన్నాథ ఆలయాన్ని రోజులో ఏ సమయంలోనైనా కూడా ఆలయం నీడ కనిపించదు. ఇది ఇంజినీరింగ్‌ అద్భుతమా లేక దైవశక్తి కారణమా అంతుచిక్కడం లేదు. ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయం ప్రవేశానికి ప్రధాన మార్గం. ఆలయంలోకి ప్రవేశించనపుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ఇది అద్భుతంలా అనిపిస్తుంది. ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమివైపు , సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేక దిశలో జరగడం విశేషం. 1800 ఏళ్ల నుంచి 45 అంతస్తుల ఎత్తు ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజూ జెండాను మారుస్తారు.

ప్రతిరోజు 2 వేల నుంచి 20 వేల వరకు ¿¶ క్తులు వస్తుంటారు. అయితే ఏడాది మొత్తం ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడ కూడా ప్రసాదం వృథా కాలేదు. దీన్ని ఏడు కుండలు ఒకదానిపై మరొకటి పెట్టి వండుతారు. అన్నింటికి కంటే ముందు పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. సైంటిస్టులకు కూడా అంతుచిక్కని రహస్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *