రెండు కుటుంబాలను ఎంపీ ఆదాల పరామర్శ!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం రెండు కుటుంబాలను పరామర్శించారు. కోవూరు నియోజకవర్గం లోని మినగల్లు కు చెందిన షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ సామంత సుబ్బారెడ్డి ఇటీవలే పరమపదించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని చింతా రెడ్డిపాలెం కు చెందిన రిటైర్డ్ ఆర్డీవో భక్తవత్సల రెడ్డి తండ్రి ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించి భక్తవత్సల రెడ్డి కి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, మల్లు సుధాకర్‌రెడ్డి, మధు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.