నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం- కలెక్టర్ చక్రధర్ బాబు!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుందన్నారు. కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాటు చేశామని సెంటర్ల దగ్గర వీడియోలో రికార్డు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆదివారం నాలుగో విడత పోలింగ్ జరగనుంది.