ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన టెస్టు కెరీర్‌లో ఇషాంత్‌ వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో పింక్‌ బాల్‌ టెస్టు(మూడో)లో ఇషాంత్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌(131) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంతే కావడం విశేషం.

2007లో టెస్టు అరంగేట్రం చేసిన లంబూ ఇప్పటి వరకు 99 టెస్టుల్లో 302 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 7/74. మాజీ స్పీడ్‌స్టర్‌ జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు భారత క్రికెటర్లు సోషల్‌మీడియాలో కంగ్రాట్స్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *