సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకు తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ట్విటర్లో షేర్ చేశారు. కాగా అన్నాత్తే షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురైన రజనీకాంత్ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు అని వారు తెలిపారు.