సహాయక్-ఎన్జీ కంటెయినర్ ప్రయోగం విజయవంతం
1 min read
దిల్లీ: భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో కలసి భారత్ నావికాదళం నిర్వహించిన ‘సహాయక్- ఎన్జీ’ కంటెయినర్ ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కంటెయినర్‌తో 50కేజీల బరువును ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏ ప్రదేశంలోనైనా జార విడచొచ్చు. దీనిద్వారా తీరానికి 2వేల కిలోమీటర్లకు పైగా దూరంలో మోహరించిన నౌకలు కీలకమైన సామగ్రి కోసం పదే పదే తీరానికి రావాల్సిన అవసరం ఉండదు. సహాయక్ ఎన్జీ కంటెయినర్‌తో ఆ సామగ్రిని పంపొచ్చు. ప్రయోగం బుధవారం గోవా తీరంలో జరిగింది. ఐఎల్-38ఎస్డీ ఎయిర్ క్రాఫ్ట్ విజయవంతంగా కంటెయినర్‌ను గాల్లోంచి జారవిడిచిందని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.