పేద ప్రజలకు నేడు నిజమైన పండుగ

పేద ప్రజలకు నేడు నిజమైన పండుగ రోజు నిన్నటి రోజున 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం.రాష్ట్ర చరిత్రలో మహత్తర ఘట్టం ఇది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే స్వంతం అని, అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ,అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పర పల్లి సమీపంలో నిరుపేద అక్కచెల్లమ్మలకు ఇంటి స్థలాల పట్టాలను అందించి వాటికి శంఖుస్థాపన చేయు కార్యక్రమానికి వారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇంటి పట్టాల లబ్ధిదారులు,అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.