పనిచేసే పనబాకను గెలిపించండి – దార్ల సునీల్

0
352

Times of Nellore (Venkatagiri)# కోట సునీల్ కుమార్ # – పనబాక యువసేన నాయకులు దార్ల సునీల్ ఆధ్వర్యంలో వేంకటగిరి నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నియోజకవర్గం పరిధి లోని సైదాపురం మండలం, 9 వ మైలు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కాలనీ లో ఇంటింటా తిరుగుతూ , కరపత్రాలను ఇచ్చి తిరుపతి ఎంపీ అభ్యర్థి డా. పనబాక లక్ష్మి ని, ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా సునీల్ మాట్లాడుతూ… పనిచేసే పనబాక లక్ష్మి గా గుర్తింపు పొందిన డా.పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కేంద్ర నిధులు మంజూరు చేయించారన్నారు. చంద్రబాబు నాయకత్వం లోని టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రము అభివృద్ధి దిశగా దూసుకు పోతుందని ఈ సందర్బంగా సునీల్ తెలిపారు. తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి డా.పనబాక లక్ష్మి ని, కురుగుండ్ల రామకృష్ణ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ తో పాటు దళిత నాయకులు పల్లి కోటేశ్వర రావు, బాలకృష్ణ చౌదరి,విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY