క్రికెట్ లీగ్ అండర్ -17 విజేత లార్డ్స్ జట్టు

0
623

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ నెల్లూరు జిల్లా క్రికెట్ లీగ్ పోటీలలో ఆదివారం వెంకటగిరి తారకరామ క్రీడా ప్రాంగణం లో అండర్ 17 విభాగం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కె ఎస్ ఆర్ సి సి (గూడూరు) , లార్డ్స్ క్రికెట్ క్లబ్ (నెల్లూరు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కె ఎస్ ఆర్ సి సి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లార్డ్స్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ జట్టులోని బాజీ 72 ,సుతేజ్ 34 ,కమాల్ 29 పరుగులు చేశారు. కె ఎస్ ఆర్ సి సి జట్టులోని అరుణ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కె ఎస్ ఆర్ సి సి జట్టు 26 .1 ఓవర్లలో కేవలం 81 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ జట్టు లోని ప్రేమ్ 24 పరుగులు సాధించగా లార్డ్స్ జట్టులోని అఖిల్ 4 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్నందించాడు. లార్డ్స్ జట్టు 124 పరుగులతో అండర్ 17 విభాగం లో విజితగా ,కె ఎస్ ఆర్ సి సి జట్టు రన్నర్ అప్ గా నిలిచింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా పి చిట్టిబాబు,రాంగోపాల్, స్కోరర్ గా సి డి శ్రీనివాస్ వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY