కనుమూరి సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్

0
467

Times of Nellore (Venkatagiri\Gudur) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరి తారకరామ స్టేడియం లో జరగుతున్న క్రికెట్ లీగ్ పోటీలలో శనివారం ఏ టి సి సి – లార్డ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఏ టి సి సి జట్టు 26 .3 ఓవర్లలో కేవలం 72 పరుగులకే అల్ అవుట్ అయింది.లార్డ్స్ జట్టులోని సింహాచలం 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లార్డ్స్ జట్టు 10 .2 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి విజయాన్నందుకుంది. ఈ జట్టు లోని కమాల్ 44 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా పి చిట్టిబాబు,రాంగోపాల్ ,స్కోరర్ గా మనోజ్ లు వ్యవహరించారు.

గ్రౌండ్ – బి లో ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ – కె ఎస్ ఆర్ సి సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో కె ఎస్ ఆర్ సి సి జట్టు టాస్ గెలిచి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఎఫ్ ఎస్ సి ఏ ట్టు లోని లీల సాయి చరణ్ – 42 ,అభిదేవ్ -40 పరుగులు చేసారు. కె ఎస్ ఆర్ సి సి జట్టులోని అబూ 3 , అరుణ్ 3 వికెట్లు పడగొట్టారు.161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కె ఎస్ ఆర్ సి సి జట్టు 32 .1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ జట్టులోని ప్రేమ్ 56 , పూర్ణచంద్ర 50 పరుగులు చేసారు. కె ఎస్ ఆర్ సి సి జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా మన్సూర్ ,సి డి శ్రీనివాసులు , స్కోరర్ గా యామిని వ్యవహరించారు.

మరోవైపు లీగ్ పోటీలలో భాగంగా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం లో జరిగిన మరో మ్యాచ్ లో జి సి సి – ఎన్ ఎస్ యూ సి సి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జి సి సి జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఈ జట్టు లోని వంశి 43 ,ముస్తఫా 52 , santan 40 పరుగులు చేసారు. ఎన్ ఎస్ యూ సి సి జట్టులోని జనార్దన్ 2 ,అజిత్ బాబు 1 వికెట్లు పడగొట్టారు.277 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన ఎన్ ఎస్ యూ సి సి జట్టు 18 .4 ఓవర్లలో కేవలం 78 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని సాకేత్ అత్యధికంగా 24 పరుగులు చేసాడు.జి సి సి జట్టు 198 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది.ఈ మ్యాచ్ కు డి అనిల్ కుమార్ స్కోరర్ గా వ్యవహరించాడు. మ్యాచ్ ను లవకుమార్ పర్యవేక్షించారు.

SHARE

LEAVE A REPLY