కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ – 2019

0
593

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలలో భాగంగా వేంకటగిరి లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో గ్రౌండ్ ఏ లో కె ఎస్ ఆర్ సి ఏ ,గూడూరు, ఎటి సి సి జట్లు పోటీ పడ్డాయి.టాస్ గెలిచిన కె ఎస్ ఆర్ సి ఏ జట్టు ఏ టి సి సి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఏ టి సి సి జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఈ జట్టులోని చరితీశ్ – 32 ,మీనేష్ రెడ్డి – 32 ,పరుగులు చేసారు.గూడూరు జట్టులోని అబూ ఉబేద్ -3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కె ఎస్ ఆర్ సి ఏ జట్టు 32 . 2 ఓవర్లలో 122 పరుగులకే అల్ అవుట్ అయింది.ఈ జట్టులోని నిఖిల్ – 39 , బాలాజీ – 24 పరుగులు చేసారు. ఏ టి సి సి జట్టు లోని నిఖిలేశ్వర్ – 4 , భార్గవ మహేష్ -4 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా చిట్టిబాబు,రాంగోపాల్,స్కోరర్ గా కిరణ్ లు వ్యవహరించారు.

మరోవైపు గ్రౌండ్ బి లో జరిగిన మ్యాచ్ లో జుల్కర్ లెవెన్ – ప్రేమ్ క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న జుల్కర్ లెవెన్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.ఈ జట్టు లోని ఐశ్వర్య – 64 , చైతన్య – 28 పరుగులు చేసారు. 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ప్రేమ్ అకాడమీ జట్టు 36 .4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టు లోనో అర్జున్ -48 , అభి – 37 పరుగులు చేసారు.జుల్కర్ లెవెన్ జట్టు లోని గీతేష్ -3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా సి డి శ్రీనివాస్,ధనుంజయ, స్కోరర్ గా యామిని వ్యవ్యవహరించారు

SHARE

LEAVE A REPLY