క్రికెట్ లీగ్ పోటీలు

0
648

Times of Nellore (Venkatagiri)  # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలలో భాగంగా వెంకటగిరి తారకరామ క్రీడా ప్రాంగణం లో ఎన్ యూ సి సి , ఎల్ ఎస్ సి సి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఎన్ యూ సి సి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జట్టులోని అల్లా బక్షు 50 ,అఖిల్ 45 పరుగులు చేసారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఎల్ ఎస్ సి సి జట్టు 25 .4 ఓవర్లలో కేవలం 69 పరుగులకె అల్ అవుట్ అయింది. ఎన్ యూ సి సి జట్టులోని అల్లాబక్షు 4 ,మాధవ్ 3 వికెట్లు పడగొట్టారు. ఎన్ యూ సి సి జట్టు 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా మన్సూర్ ,రాంగోపాల్ ,స్కోరర్ గా వినోద్ లు వ్యవహరించారు.

మరోవైపు గ్రౌండ్ బి లో జరిగిన మ్యాచ్ లో ఎస్ పి సి సి, ఎన్ సి సి (జూ ) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచినా ఎస్ పి సీసీ సి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 35 .5 ఓవర్లలో 208 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టు లోని పవన్ 56 ,భాను 54 పరుగులు చేయగా, ఎన్ సి సి జట్టులోని మన్విత్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఎన్ సి సి (జూ) జట్టు 35 .4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టు లోని అన్వర్ 53 పరుగులు చేయగా , అభిరామ్ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ పోటీలో ఎన్ సి సి జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందగా, సి డి శ్రీనివాస్, మోహనరావు అంపైర్ లుగా, యామిని స్కోరర్ గా వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY