వేంకటగిరి లో సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్

0
423

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా వేంకటగిరి తారకరామా స్టేడియం లో శనివారం జరిగిన మ్యాచ్ లో కె ఎస్ ఆర్ సి సి గూడూరు – ప్రేమ్ క్రికెట్ అకాడమీ ,నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కె ఎస్ ఆర్ సి సి జట్టు టాస్ గెలిచి పి సి ఏ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పి సి ఏ జట్టు 19 .3 ఓవర్లలో 53 పరుగులకు అల్ అవుట్ అయింది. గూడూరు జట్టు లోని అరుణ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కె ఎస్ ఆర్ సి సి జట్టు కేవలం 8 .2 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి విజయం సాధించింది. ఈ జట్టులోని నిఖిల్ 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా పి చిట్టిబాబు, రాంగోపాల్, స్కోరర్ గా కిరణ్ వ్యవహరించారు.

మరోవైపు గ్రౌండ్ బి లో ఏ టి సి సి – జుల్కర్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏ టి సి సి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ జట్టు లోని లితిన్ రాజ్- 74 ,చరితీశ్ -59 , నిఖిలేశ్వర్ రెడ్డి – 32 ,మీనేష్ రెడ్డి – 26 పరుగులు చేసారు. జుల్కర్ లెవెన్ జట్టులో ఐశ్వర్య – 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జుల్కర్ లెవెన్ జట్టు 25 .2 ఓవర్లలో 156 పరుగులకే అల్ అవుట్ అయింది.ఈ జట్టు లోని సింధూజ 26 పరుగులు సాధించగా ఏ టి సి సి జట్టు 96 పరుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా మన్సూర్, సి డి శ్రీనివాస్, స్కోరర్ గా యామిని వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY