బిగ్ బాస్ – 3 ఇంటి సభ్యులు వీళ్ళే!

0
369

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – స్మాల్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్న బిగ్‌బాస్‌-3లో ఎంట్రీ ఇవ్వబోతున్న హౌస్ మేట్స్ ఎవరు? అనేదానిపై రకరకాల ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. వాళ్లు.. వీళ్లు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో ఫస్ట్ షో టెలికాస్ట్ కాబోతున్న సమయంలో.. ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 100 రోజులు సాగనున్న బిగ్‌బాస్‌-3 షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్స్‌ పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు షోలో పాల్గొనబోయే 15మంది కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈసారి V6 న్యూస్ తీన్మార్ చేస్తూ రాజీనామా చేసిన సావిత్రి, ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి, నటి హేమ, వరుణ్‌ సందేశ్‌, ఆయన భార్య వితికా, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పాల్గొనబోతున్నారు. 21 జులై 2019 నుంచి ప్రారంభం అవుతున్న బిగ్ బాస్ షోలో 15మంది వివరాలు:
1. సినీ నటి హేమ
2. యాంకర్ శ్రీముఖి
3. తీన్మార్ యాంకర్ సావిత్రి
4. నటి మలిరెడ్డి హిమజా రెడ్డి
5. వరుణ్ సందేశ్
6. వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు
7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ
8. టీవీ యాక్టర్ అలీ రెజా
9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్
10. పునర్వీ భూపాలం
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌
13. యూట్యూబ్ స్టార్ మహేష్
14. టీవీ నటి రోహిణి
15. డబ్‌స్మాష్ స్టార్ అషూ రెడ్డి

నాగార్జున్ హోస్ట్‌గా జూలై 21 నుండి ప్రారంభం కానున్న ఈ రియాలిటీ షో 100 రోజుల పాటు సాగనుంది. ఇందులో ఈ 15మంది సందడి చేయనున్నారు.

SHARE

LEAVE A REPLY