వైభవంగా బాలకోటేశ్వర స్వామి కళ్యాణం

0
368

Times of Nellore (Balayapalli) # సూర్య # – నెల్లూరు జిల్లా, బాలాయపల్లి మండలం , కోటంబేడు గ్రామంలో మంగళ వారం రాత్రి శ్రీ బాలకోటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. గూడూరు శ్రీ సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విశేషంగా జరిగిన స్వామి వారి కళ్యాణం కార్యక్రమానికి, వేమూరి పురందర రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వేంకటగిరి రాజా రామ్ కుమార్ యాచేంద్ర , రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్ర శేఖర్ రెడ్డి, ఎం వి ఆర్ ట్రస్ట్ చైర్మన్ నక్కా వెంకటేశ్వర్లు, ఢిల్లీ బాబు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు కొత్తపల్లి సాయి కుమార్, కోట సునీల్ కుమార్ దంపతులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY