“తన లోకం” చేరుకున్న “ఇంద్రజ”

0
537

Times of Nellore – శ్రీదేవి… ఒక పేరు కాదు ఒక వైబ్రేషన్, భారతీయ సినీ ప్రేమికుల హృదయ స్పందన భగవంతుని సృష్టిలో మహా అద్భుతం 54 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శివకాశిలో జన్మించిన “అమ్మయ్యంగార్ అయ్యప్పన్” భారత సినీరంగంలో సంచలనాలు సృష్టిస్తుందని శ్రీదేవి కన్నవారు కుడా ఊహించి ఉండరు. నాలుగేళ్ళ వయస్సులో సినీరంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి 50 సంవత్సరాలుపాటు కళామ తల్లి సేవలో తరించడం.. ఆమె భాగ్యం, 13 సంవత్సరాలకే ప్రధాన నాయిక అవకాశం తమిళంలో “మూండ్రు ముడుచ్చు” రూపంలో ఆమెను వెతుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఆమె సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. 15 ఏళ్ల వయస్సులో “పదహారేళ్ళ వయస్సు” చిత్రం లో నటించిన ఆమెను, కుర్రకారు ఆ పాత్రలోని శ్రీదేవిని ప్రేమించే లాగా చేసుకుంది. ఆ తర్వాత ఆమె ప్రయాణం దక్షిణాదిలో అప్రతిహతంగా సాగింది. 1977 లో జూలీతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసినప్పుడు అక్కడి సీనియర్ నాయికలు, సినీ పెద్దలు, బాలీవుడ్ లో ఒక మెరుపు ప్రవేశించిందని ఉహించి ఉండరు. హేమమాలిని, రేఖ, రాఖీ వంటి సీనియర్ నటీమణులను పక్కకునేట్టి బాలీవుడ్ తన చుట్టూ తిరిగేలా చేసుకోవడం.. ఒక శ్రీదేవికే సాధ్యమైనది. ఎంతో మంది మిస్ యూనివర్స్ లు, మిస్ వరల్డ్ లు, మిస్ ఇండియాలు.. బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి ఛరిష్మాని ఏ మాత్రం తగ్గించలేకపోయారు.

ముఖ్యంగా దక్షిణాది తారల మీద తేలికభావం ఉన్న బాలీవుడ్ లో ఆ భావనలు, సంప్రదాయాలు ఈ “రాణీకాసుల రంగమ్మ” ముందు చెల్లని కాసులయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్, మాలీవుడ్ లలో దర్శక, నిర్మాతలకు హీరోహిన్ అంటే మొదటి ప్రధాన్యం శ్రీదేవి మాత్రమే.. తెలుగులో “వసంత కోకిల” ఘన విజయం తరువాత ఆరేళ్లకు హిందీలో నిర్మించిన “సద్మా” లో నటించడానికి శ్రీదేవికి ప్రత్యామ్నాయం దొరకలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు శ్రీదేవి ఛరిష్మా, స్టామినా.. బహుశ ఆ పాత్రలో వేరే నటిని ఉహించుకోలేపోయారు. అందంతో పాటు అభినయం, ఆహార్యం, ఆగికం, నాట్యం, వాచకం, కలబోసిన బంగారు బొమ్మ శ్రీదేవి. భారతీయ సినీరంగంలో హేమాహేమీలు, సీనియర్ నటులైన ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్, ధర్మేంద్ర, అంమ్రీష్ పురి, డేని, అనుపమ్ ఖేర్, ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, చిరంజీవి, రజిని కాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్ ఇలా మూడు తరాల హీరోలతో, హిరోయిన్ గా నటించడం ఘనత ఒక శ్రీదేవికే దక్కుతుంది.

కమల్ వంటి గొప్ప నటుడు కూడా వసంత కోకిలలో శ్రీదేవి ముందు ఫేడ్ అయ్యిపోయాడన్నది నిజం.. ఆకలి రాజ్యం వంటి కళా ఖడంలో కమల్ తో పోటీపడ్డి మెప్పించిన ఈ అతీలోక సుందరికీ 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించి, పద్మశ్రీ ప్రతిష్టను మరింత పెంచింది. బాల్యం నుంచి కూడా ఆమె అవకాశాల కోసం వెతుకొలేదు.. అవకాశాలే ఆమెను వెత్తుకుంటూ వచ్చాయి. సెట్ లో రిజర్వడ్ గా ఉండే శ్రీదేవి కెమెరా ముందుకు వస్తే చెలరేగిపోతుంది. 50 ఏళ్ళ పాటు అభిమానులు ఆమెను ప్రేమించడం అభిమానుల గొప్పతనం కాదు. అది శ్రీదేవి ఛరిష్మా కు నిదర్శనం.. రామ్ గోపాల్ వర్మ లాంటి సెలబ్రీటీలు నేను శ్రీదేవి అభిమానిని అని గర్వంగా చెప్తుంటారు. శ్రీదేవిని దగ్గర చూడానికి “క్షణం క్షణం” సినీమా తీశానని వర్మ చెప్పాడంటే ఆమె స్థాయి ఏంటో అర్థమవుతుంది ఈ తరం హీరోయిన్ లకు శ్రీదేవి రోల్ మోడల్.. ఇంత మంది అభిమానులు.. పేరు ప్రతిష్టలు ఉన్నా, ఆమె తల్లి మరణం ఆమెను ఒంటరిదాన్ని చేసింది. ఆ సమయంలో బోనీ కపూర్ రూపంలో ఆమెకు కొంత ఊరట లభించింది. 1996 లో బోనీ కపూర్ ను పెళ్లాడి, సంసార జీవితం ప్రారంభించింది. అక్కడ నుండి ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. భర్త, పిల్లలు సంసారం అనే బంద్ధంలో దశాబ్ధకాలం విరామం వచ్చిన ఆమె పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం చెక్కుచెదరలేదు. 10 ఏళ్ళ తర్వాత ఆమె నటించిన నాన్ కమర్షియల్ చిత్రం “ఇంగ్లీష్ వింగ్లీష్” ఘన విజయం సాధించడమే అందుకు తార్కాణం. తల్లి మరణంతో ఆమెను ఎంతోగానో ప్రేమించే బిడ్డలు రెక్కలు తెగిన పక్షులు అయ్యిపోయారు.

SHARE

LEAVE A REPLY