పేద వాళ్ళ పొట్ట కొడుతుంది ఈ ప్రభుత్వం – నెల్లూరు టిడిపి నేతలు!

0
88

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  – రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం లో మూసివేసి వున్న అన్నా క్యాంటీన్ లు వెంటనే ప్రారంభించాలని కోరుతూ మద్రాసు బస్ స్టాండ్ వద్ద వున్న అన్నాక్యంటీన్ ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. TDP నగర అధ్యక్షుడు మరియు మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ నగర మేయర్ అబ్దుల్ అజీజ్, బీదా రవిచంద్ర, తాళ్ళపాక అనురాధ తదితర నెల్లూరు టిడిపి నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.

తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ పేదవాడి కి మంచి భోజనం ఐదు రూపాయలకే పెట్టాలని ఉద్దేశంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్ లను మూసివేయడం అమానుషమని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బొమ్మ ఉందని ఇటువంటి పని చేయడం మంచిది కాదని, కావాలంటే ఫోటోలు మార్చుకుని అన్న క్యాంటీన్ ను కొనసాగించాలని వారు పేర్కొన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక టిడిపి ప్రజాహిత కార్యక్రమాలు అన్నిటికీ అవినీతి అంటగట్టి సంక్షేమ పథకాలను ఆపి వేస్తున్నారని టిడిపి నాయకులు మండిపడ్డారు. ఈ ధర్నాలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY