ఆడుతూ.. పాడుతూ..

0
877

Times Of Nellore (Nellore)- రాష్ట భవిష్యత్ పై దిశా.. నిర్దేశాలు.. యువతీ యువకుల్లో ఉద్యోగ, ఉపాధి పట్ల ఉన్న సందేహాలు, వర్దమాన రాజకీయాలు, ప్రత్యేకహోదా, పెద్దనోట్ల రద్దు, పారిశ్రామిక ప్రగతి, నిర్వాసితులు గోడు.. అవినీతి జాడ్యం, ఉద్యోగాలలో వెనుకబాటుతనం. చిలిపి క్వశ్చన్లు,, సంక్షిప్త సమాధానాలు ..ఇలా.. గంటన్నరపాటు జరిగిన నారా లోకేష్ విద్యార్దుల‌తో ముఖాముఖి కార్యక్రమం ఉత్కంఠంగా, ఉల్లాంసంగా,, కాస్త ఉద్విగ్నంగా సాగింది.

ఒక్క రోజు పర్యటన నిమిత్తం వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన ఉత్పాహంగా.. ఉల్లాసంగా.. సాగింది.. గత రాత్రి నెల్లూరులోని మినర్వ హోటల్ లో బస చేసిన లోకేష్ ఇవాళ ఉదయం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సారధ్యంలో నగరమంతా కలియతిరిగారు. ఆపై నారాయణ మెడికల్ క్యాంపస్ లో విద్యార్దులతో ముఖాముఖి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బోజన సమయంలో చంద్రన్నభీమా లబ్దిదారులకు చెక్ ల పంపిణీ చేశారు. అనంతరం గూడూరులో జరిగిన చైతన్య యాత్రలో పాల్గొన్నారు.

ఒక్కొక్కరుగా ఎక్కుపెట్టిన ప్రశ్నలు,.. తడుముకోకుండా ఒప్పిక, సహనంతో విద్యార్దులకు సమాధానాలు చెప్పారు. స్టయిట్ క్వశ్చన్, స్టయిట్ ఆన్సర్స్ అంటూ కొందరు విద్యార్దులు లోకేష్ వ్యక్తిగత జీవిత విశేషాలపైనా ప్రశ్నించారు. ఒక దశలో పలువురు విద్యార్దులు ఆవేశంతో ప్రశ్నలు సంధించారు. గూడూరు ఆదిశంకరా కాలేజీకి చెందిన సాయి సతీష్ అనే నాయుడుపేట విద్యార్ది ఓటుకు నోటుకు అంశంపై తీవ్ర ఆవేశంతో ప్రశ్నించాడు. అక్రమ సంపాదనలో జగన్ ముద్దాయి అయితే ఓటుకు నోటులో మీ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా ముద్దాయే కదా మరి అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తారని ప్రశ్నించాడు. ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలొస్తాయి.. ఉపాధి కలుగుతుంది.. మరెందుకు ప్యాకేజీల కోసం పాటుపడుతున్నారంటూ నిలదీశారు. దీనికి లోకేష్ నిబ్బరంగా, నిదానంగా,, సహనంగా సమాధానిమిచ్చారు.. ఆవేశంగా ప్రశ్నిస్తున్న విద్యార్దిని కొందరు టీడీపీ నాయకులు, పోలీసులు, స్టూడెంట్ నాయకులు ఆ విద్యార్దిని ముట్టడించి కట్టడి చేసేందుకు ప్రయత్నం చేయగా ఇంట్రాక్షన్ లో వారి వారి మనోభావాలను ఆవిష్కరించాలంటూ, అతన్ని ఎవ్వరూ ఆపొద్దుంటూ,, స్వేచ్చ ఇవ్వాలంటూ స్టేజ్ మీద నుంచే ఆదేశించారు. ఆ విద్యార్ధి అడిగిన ప్రశ్నలన్నింటికి లోకేష్ సావదానంగా సమాధానం చెప్పారు. అవినీతి అక్రమాలను ఒప్పుకునేది లేదన్నారు. ఓటుకు నోటులో కోర్టు నిర్దారిస్తే రేవంత్ అయినా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు..

అవినీతి, అక్రమాలకు టీడీపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందని లోకేష్ అన్నారు. అలాంటి ఆలోచనల తనకు వచ్చినా మా నాన్నచంచల గూడ జైలుకు పంపిస్తాడన్నారు. కొందరు ఇప్పటికే జైలుకు వెళ్లారు.. మళ్లీ కూడా వెళ్లేందుకు సిద్దమవుతున్నారని జగన్ కు ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక మండలి పేరుతో ఉద్యోగ ఉపాది కల్గుతుందంటూ భూములు తీసుకున్న క్రుష్టపట్నం పోర్టు బయటి వారితో నింపేసిందని పోర్టు నిర్వాసితుడు, నేలటూరుకు చెందిన కిరణ్ అనే విద్యార్ది మరింత ఆవేశం, ఆందోళనతో ప్రశ్నించాడు. పోర్టులో బయటవారికి ఉద్యోగాలిస్తూ అన్ని విధాలా తాము నష్టపోయామని కన్నీరు పెట్టారు.. కొందరు నాయకులు పరిహారం విషయంలోనూ తప్పుదారి పట్టించారన్నారు. దానిపై వేదికపై ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా 2 బస్సులో వెళ్లి ఎకరా రూ.3లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.7 లక్షలు చేశామన్నారు. ఆ విద్యార్దికి తెలియక అలా మాట్లాడుతున్నారన్నారు. ఉద్యోగాల విషయంలో పోర్టుతో చర్చిస్తామన్నారు.. స్థానికులకు ఉద్యోగ విషయాలపై మాట్లాడుతూ ఇటీవల శ్రీ సిటీలో చిన్న ప్రమాదానికి విదేశీయుల కారును తగలపెట్టారని స్థానికులు ఇలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జీతాల విషయంలో పెద్ద ఎత్తున ఆశించకుండా ఉన్న ఉద్యోగాలతో సంత్రుప్తి పడాలని కోరారు.

ప్రత్యేక హోదా, పెద్ద నోట్ల రద్దు ప్యాకేజీలు అనుమతించడాలపై లోకేష్ సావదానంగా సమాధానాలిచ్చారు. ప్యాకేజీల వల్ల పోలవరం, పరిశ్రమలు, ప్రత్యేక నిదులు వస్తాయన్నారు. జీడీపీ పెరుగుతుందని, కేంద్రంతో ఘర్షణ ధోరణితో వెళ్లకుండా అభివ్రుద్ది చేసుకునేందుకు కొన్ని అంగీకారాలు తప్పలేదన్నారు. ప్యాకేజీల చట్టబద్దతకు పైట్ చేస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తినా భవిష్యత్ లో అవినీతికి, అక్రమార్జనకు అడ్డుకట్టవేసే అవకాశం ఉందని వివరించారు. కుటుంబం, భార్య, పిల్లలు వ్యక్తిగత జీవితంపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ అభివ్రుద్ది, రాజకీయాలల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయక తప్పదన్నారు.

SHARE

LEAVE A REPLY