సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

0
478

Times of Nellore(Mumbai) – సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి షమ్మి(89) కన్నుమూశారు. సీనియర్ బాలీవుడ్ నటి, టెలివిజన్ యాక్ట్రెస్ షమ్మి(89) మృతి చెందారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా ఈ విషయాన్ని వెల్లడించారు. షమ్మి కమెడియన్‌గా చాలా ఫేమస్. 200లకు పైగా సినిమాల్లో షమ్మి నటించారు. ఆమె నటించిన చిత్రాల్లో కూలీ నంబర్ 1, హమ్, గోపీకిషన్, హమ్ సాత్ సాత్ హై తదితర చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. టెలివిజన్‌లో కూడా షమ్మి ప్రముఖ స్థానం వహించారు. దూరదర్శన్‌లో చాలా షోస్‌లో నటించారు.
మంగళవారం ఉదయం సందీప్ సోషల్ మీడియాలో షమ్మి పిక్‌ని పోస్ట్ చేసి ‘‘మేము మిమ్మల్ని మిస్ అయ్యాం. మీరెప్పుడూ మాకు స్పెషల్. మీ ఆత్మకు శాంతి కలగాలి షమ్మి ఆంటి 1929-2018. లవ్ యు’’ అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా షమ్మి మృతిపై సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘షమ్మి ఆంటీ.. చాలా మంచి నటి. చాలా సంవత్సరాల పాటు నటిగా కొనసాగారు. వయసు, అనారోగ్యం కారణంగా డియర్ ఫ్యామిలీ ఫ్రెండ్.. మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.’’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

SHARE

LEAVE A REPLY