పోలీస్ స్టేషన్ నుంచి డాక్టర్ రవీంద్రనాధ్ ఠాగూర్ పరార్ !!

0
486

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-స్టాఫ్ నర్సుపై లైంగికంగా దాడికి దిగిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బుధవారం నాడు రాత్రి ఉదయం పోలీసు స్టేషన్ నుండి తప్పించుకొన్నారు. ఈ విషయమై పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ
సీరియస్ అయ్యారు. సీఐ సత్యనారాయణను వివరణ కోరారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుండి అదృశ్యమయ్యారు. డాక్టర్ తప్పించుకొన్నాడా.. లేక పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా అతడిని తప్పించారా అనే అనుమానాలు కూడ వ్యక్తమవుతున్నాయి

నిందితుడు డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ను కోర్టుకు తరలించడానికి కొన్ని క్షణాల ముందు ఆయన తప్పించుకోవడంపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్థానిక సీఐ సత్యనారాయణ వివరణ కోరారు. బుధవారం నాడు రాత్రి నుండి డాక్టర్ రవీంద్రనాథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.పోలీస్ స్టేషన్ నుండి డాక్టర్ అదృశ్యం కావడంపై సీఐను పోలీసు ఉన్నతాధికారులు వివరణ
కోరారు.

SHARE

LEAVE A REPLY