చదువుకు కులం అడ్డురాదు-పెంచలనాయుడు!!

0
181

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒  చదువుకు కులం అడ్డుకాదని , అడ్డురాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నపనేని పెంచలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దానితోపాటు పాఠశాలలోని అటెండెన్స్ రిజిస్ట్రార్ లో కులం అనే వరుసను తీసివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని అన్నారు.విద్యార్థులకు చదువే కావాలి గానీ కులాలతో , మతాలతో పనిలేదని ఎటువంటి తారతమ్యలు లేకుండా చదువుకునే ప్రతి విద్యార్థికి కులం అనే వరుసను పూర్తిగా తీసివేసే నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రంలోని విద్యార్థిని ,విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.అంతే కాక భావితరాలకు కులగజ్జి అంటకుండా విద్యార్థి దశలోనే అణచివేయ్యలని జగనన్న వేసిన అడుగు విజయవంతమవుతుందని తెలిపారు.

SHARE

LEAVE A REPLY