జవాన్ల త్యాగం మరువలేనిది-పాశిం సునీల్ కుమార్!!

0
58

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-నెల్లూరుజిల్లా గూడూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ సంతోష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరజవాన్ సంతోష్ ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి క్రొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ టిడిపి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా నిర్భయంగా జీవిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో భారత్ జవాన్లు శత్రువులను దేశంలోకి రానివ్వకుండా నిరంతరం సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్నారని , చైనా దేశం చేసిన దొంగ దెబ్బకి మన దేశ సైనికులు మృతి చెందడం బాధాకరమని మృతి చెందిన సైనికుల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

SHARE

LEAVE A REPLY