మండపం గ్రామంలో సిమెంటు రోడ్లను, సైడు కాలువలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.

0
112

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు జిల్లా టి.పి.గూడూరు మండలం మండపం గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పాలనలో కరువు విలయతాండవం చేసిన విషయం మనందరికీ తెలిసినదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మహానేత పాలన తిరిగి వచ్చి సకాలంలో వర్షాలు పడుతున్నాయి.రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ ఒక్కటి అమలు చేయలేదు.కానీ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ కన్నా మిన్నగా చేస్తున్నారు.అమ్మ ఒడి ద్వారా 15 వేలు ఇచ్చి అందరి ఇళ్లలో నిజమైన సంక్రాంతిని తీసుకొని వచ్చారు.ప్రస్తుతం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి.నేను 7 నెలల్లో ఎంత అభివృద్ధి చేశానో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేశామని విమర్శలు చేసే వాళ్లు, ఎక్కడ చేశారో నిరూపించండి గత 5 సంవత్సరాలలో ఆగిపోయిన అభివృద్ధిని ఈ 5 సంవత్సరాల్లో మిన్నగా చేస్తాను మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, మీరు గర్వపడే విధంగా పనిచేస్తాను అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY