మహిళల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు- జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ !!

0
59

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –మహిళలు, యువతులు మరియు బాలలపై జరిగే అఘాయిత్యాలు, భౌతిక దాడులు, అత్యాచారాలను నిరోధించడానికి మరియు వారి రక్షణ కోసం నెల్లూరు జిల్లా పోలీసు శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని జిల్లా యస్.పి. శ్రీ ఐశ్వర్య రాస్తొగి తెలిపారు.మినీ కాన్ఫరెన్స్ హాల్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత మనందరి భాధ్యత అని, జిల్లా వ్యాప్తంగా శక్తి టీం, మహిళా పోలీసు బృందాలతో పాటు బ్లూకొల్ట్స్, రక్షక్, హైవే పెట్రోలింగ్ సేవలను జిల్లా ప్రజలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.డయల్ 100 కు అర్బన్ పరిధిలో 5 నుండి 10 నిముషాల లోపు, గ్రామాలలో 10 నుండి 15 నిముషాల లోపు స్పందించడం జరుగుతుందని జిల్లాలో అత్యాధునిక కమాండెంట్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన డయల్ 100 కు మరియు పబ్లిక్ ఐ whats App నంబర్: 9390777727 జిల్లా ప్రజలు వారి సమస్యలు మరియు సమాజంలో జరిగే వివిధ ఆసాంఘీక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటు ఇసుక, ఎర్రచందనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు అక్రమ నిల్వల గురించి సమాచారం అందించాలని తెలిపారు. మహిళల మరియు ఇతర సమస్యల ప్రాముఖ్యతను బట్టి వెంటనే కమాండ్ కంట్రోల్ తో పాటు, లోకల్ పోలీస్ స్టేషన్ యస్.ఐ., బ్లూకోల్ట్స్, శక్తీ టీం లు మరియు రక్షక్ లు సకాలంలో స్పందించి, వాటిని పరిష్కరిస్తామన్నారు.

SHARE

LEAVE A REPLY