నెల్లూరులో క‌సాయి తండ్రి… ల‌వ్ మ్యారేజ్ చేసుకుంద‌ని హ‌త్యాయ‌త్నం

0
2601

Times Of Nellore (Nellore)-కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని కూతురిపై క‌క్ష పెంచుకున్నాడు ఓ క‌సాయి తండ్రి… పేగు బంధాన్ని తెంచుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు..అనుమానం రాకుండా క‌ల్లిబొల్లి మాట‌ ల‌తో మాయ చేశాడు.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి క‌దా డ‌బ్బులిస్తారు.. రా అంటూ కూతురికి పోన్ చేశాడు.. కిడ్నాప్ చేయ‌బోయాడు..త‌ర్వాత ఏం జ‌రిగింది…? ఇంత‌కీ ఏవ్వ‌రా క‌సాయి తండ్రి… తెలియా లంటే వాచ్ దిస్ స్టోరీ..

ఆత్మ‌కూరుకు చెందిన స‌ల్మా అదే ప్రాంతానికి చెందిన మ‌హేంద్ర‌ను ప్రేమించి పెద్ద‌ల‌ను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇది స‌ల్మా కుటుంబ స‌భ్యుల‌ను న‌చ్చ‌లేదు. దీంతో త‌మ కుటుంబం నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని గ్ర‌హించిన స‌ల్మా నెల్లూరుకు మ‌కాం మార్చింది.. అప్ప‌టి నుంచి మ‌హేంద్ర‌, స‌ల్మాలు సంతోషంగా కాలం గ‌డుపుతూ ఉన్నారు.. ఇంత‌లో స‌ల్మా ఇంటి నుంచి పోన్ వ‌చ్చింది.. ఎలా ఉన్నావ్ అంటూ స‌ల్మా తండ్రి పోన్ చేశాడు.. బాగోగులు అడిగాడు..దీంతో త‌న తండ్రి మారిపోయాడు త‌మ‌ను అక్కున చేర్చుకుంటాడ‌ని స‌ల్మా సంబ‌ర‌ప‌డిపోయింది.. అడ‌పాద‌డపా స‌ల్మా తండ్రి పోన్ చేస్తూ మాట్లా డుతూ ఉండేవాడు.. కానీ స‌ల్మా తండ్రి మాత్రం త‌మ‌కి ఇష్టంలేకుండా కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని స‌ల్మాపై మ‌న‌సులో ప‌గ అలాగే ఉంది.. దీంతో స‌ల్మాను ఎలాగైన చంపాల‌నుకున్నాడు.. అందుకు ప‌క్కా స్కేచ్చే వేశాడు.. మాట్లాడాలి.. జొన్న‌వాడ స‌మీపంలోని దొడ్ల డెయిరి వ‌ద్ద రా అంటూ స‌ల్మాకు ఫోన్ చేశాడు.. అక్క‌డికెళ్లిన స‌ల్మాను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకు పోయేందుకు య‌త్నించాడు.. నోట్లో గుడ్డ‌లు కుక్క‌బోతుండ‌గా ప్ర‌తి ఘ‌టించిన స‌ల్మా గ‌ట్టిగా కేక‌లు వేసింది.. దీంతో స్తానికులు గ‌మ‌నించి ఆమె ను కాపాడారు… స‌మాచారం అందుకున్న రూర‌ల్ పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు..

SHARE

LEAVE A REPLY