గూడూరులో యువతిని రేప్ చేసి చంపిన ఐదుగురు హంతకులు అరెస్ట్…!!

0
360

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –గూడూరులో మతి స్థిమితంలేని యువతిపై అత్యాచారం చేసిన కీచకులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ హత్య కేసులో శివకుమార్, వెంకటేష్, శరత్, వినోద్ కుమార్, లక్ష్మయ్య అనే ఐదుమంది నిందితులను గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. కొంతకాలం క్రితం నుంచి యువతిపై కన్నేసిన శివకుమార్.. ఈ నెల ఐదవ తేదీన దోశపిండి కోసం బయటకి వచ్చిన యువతికి మాయమాటలు చెప్పి.. నిందితులతో కలిసి.. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయంలో యువతి పెనుగులాడడంతో రాయితో తలపై మోది, హత్య చేశారు. అనంతరం యువతిని నగ్నంగా పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అత్యాచారం పట్ల నిరసనలు వెల్లువెత్తడంతో, కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు రోజుల వ్యవధిలోనే కేసును చేధించారు. నిందితుల్లో ముగ్గురు రౌడీ షీటర్లు, గతంలో పలు హత్య కేసుల్లో కూడా నిందితులుగా వున్నారని పోలీసులు చెప్పారు

SHARE

LEAVE A REPLY