ఫ్రెండ్ షిప్ డే సాంగ్ అదుర్స్‌

0
982

Times Of Nellore ( Cinima ) – ‘నేను శైలజ’ తర్వాత హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు యూత్‌కు బాగా నచ్చేసింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రామ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో జీప్ వెలుతున్నట్లు ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే ఈ చిత్రంలోని ‘ట్రెండు మారినా ఫ్రెండు మారడు’ అనే సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రిలీజ్ చేయడంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక కథానాయికగా నటిస్తోంది
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు
కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 2017 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతేడాది రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్‌ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు.
ఫస్ట్ లుక్ అదుర్స్
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ – ‘‘రామ్‌ లుక్‌ దగ్గర్నుంచి సై్టల్‌ వరకూ ప్రతిదీ కొత్తగా ఉంటాయి. ‘నేను శైలజ’ తర్వాత కిశోర్‌ తిరుమల మరోసారి రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే మంచి కథ రెడీ చేశాడని తెలిపారు.
ప్రేక్షకులు తమను తాము ఊహించుకుంటారు
దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ – ‘‘ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ‘నేను శైలజ’ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.
ఉన్నది ఒకటే జిందగీ
యువ హీరో శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

SHARE

LEAVE A REPLY