ఇంటికే నిత్యావసరాల పంపిణీ – కమిషనర్ పివివిస్ మూర్తి

0
115

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, స్వీయ నియంత్రణ లో ఉన్న పౌరుల సౌలభ్యం కోసం డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్ యజమానులు, నిత్యావసర సరుకుల హోల్ సేల్ విక్రయాల నిర్వహకులతో చర్చించిన అనంతరం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ప్రజలంతా 21 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటూ కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రజల నిత్యావసరాలను, భోజన సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబుల సూచనల మేరకు ఆర్డీఓ, డిఎస్పీ ల సహకారంతో నూతన సౌలభ్యాన్ని కల్పించామని, ప్రధాన షాపింగ్ మాల్స్ కు ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరుకులను సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా స్విగ్గి, జొమాటో ఫోన్ అప్లికేషన్ ల ద్వారా నిర్ణీత ఆహార పదార్ధాలను నేరుగా వినియోగదారుని ఇంటికే సరఫరా చేసేలా ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని కమిషనర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకుని స్థానికంగా ఎవరికైనా అలాంటి రోగ లక్షణాలు కలిపిస్తే వెంటనే కాల్ సెంటర్ కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

SHARE

LEAVE A REPLY