గోరంత సహాయం చేసి….. కొండంత జరిమానాలు వసూలు చేస్తున్నారు- చేజర్ల !!

0
76

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆటో వారికి గోరంత సహాయం చేసి,కొండంత జరిమానాలు వసూలు చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో రవాణాశాఖ అధికారి నెలకు రూ . 9 లక్షలు, ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రూ .5 లక్షల జరిమానా వాసులు చేయాలనీ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ విధించిందన్నారు . నెల్లూరు జిల్లాలో వాహనమిత్ర పథకం క్రింద ఆటో వారికి రూ . 18.47 ఇచ్చారని, జరిమానాలు మాత్రం 52.20 కోట్లు విధించారని అన్నారు.

SHARE

LEAVE A REPLY