కరోనా మహమ్మారిని అంతం చేద్దాం..!

0
24

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా వుండాలని ,ఆ మహమ్మారిని అంతమొందిద్దామని ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు.లీలా మోహన్ కృష్ణ కోరారు.ఈ సందర్భంగా ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరుపట్టణం ,గాందీ నగర్ పరిసర పాంత ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు.జాతీయ డాక్టర్సడే ని పురస్కరించుకొని కరోనా సమయంలో విశేషమైన సేవలు అందిసుతున్న వైద్యులకు,వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమిత్తం ఆర్శోనేకెం ఆల్బమ్ 30 అనే హోమియో మందులను ఆయుష్ శాఖ సూచించిన హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ అవసరం వుంటే నే ఇంటి నుంచి బయటకు రావాలని,బయటకు వచ్చి నా మనకు రక్షణ గా మాస్క్ ధరించి ,పరిశుభ్రత కోసం బయటకు వెళ్ళినప్పుడు,ఇంటికి వచ్చిన వెంటనే చేతులను శానిటేజన్ చేసుకుని ,ఆరోగ్య వంతులుగా వుండాలని , కరోనాను అంతం చేయాలని ఆయన కోరారు.అంతే గాక శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంచే నిమిత్తం ఈ హోమియో మందులు మూడు రోజుల పాటు వాడి చేతులు శుభ్ర పరుచుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రజలు వున్నారు.

SHARE

LEAVE A REPLY