ఈనెల 24 నుంచి భారత రక్షణశాఖ అస్త్రశస్త్రాల ప్రదర్శన..!!

0
44

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ భారత రక్షణ వ్యవస్థలో సైనిక, వైమానిక, నావికా దళాలు కీలకంగా వ్యవహరిస్తాయి. దేశ భద్రతలో త్రివిధ దళాలతో పాటు పారామిలిటరీ దళాలు సేవలు అందిస్తున్నాయి. కాగా, భారత వైమానిక, నావికా దళాలు సంయుక్తంగా ఈ నెల 24 నుంచి 26 వరకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తీరంలో విన్యాసాలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పారు. బీచ్‌లోని నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో ‘జల ప్రహార్‌ 20’ పేరిట విన్యాసాలు జరుగుతాయని తెలిపారు.

భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలవి కీలక పాత్ర. రాష్ట్రపతి భారత రక్షణ దళాలకు అధిపతిగా (సుప్రీం కమాండర్) ఉంటారు. ఏటా డిసెంబరు 7న రక్షణ దళాల ఫ్లాగ్ డేగా నిర్వహిస్తారు. భారత రక్షణ దళాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947, 1965, 1971, 1999ల్లో పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటు భారత్ 1962 లో చైనాతో యుద్ధం చేసింది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో 13 లక్షలకు పైగా సైనికులు దేశ రక్షణలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY