నాయుడుపేట లో సీసీ కెమెరాల వ్యవస్థ ప్రారంభం

0
323

Times of Nellore (Nayudupet)#కోట సునీల్ కుమార్ # – నేరాల నియంత్రణే లక్ష్యంగా సిసి కెమెరాల వ్యవస్థను నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో ప్రముఖ పరిశ్రమ గ్రీన్ టెక్ ప్రెసిడెంట్ మాత్యు చిన్ భార్య ఇమే లియా చేతుల మీదగా నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్యరాస్తోగి ప్రారంభింపజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… నేరాల నియంత్రణే ధ్యేయంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. . జిల్లాలో దాదాపు 900సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, అందులో భాగంగానే నాయుడుపేట పట్టణంలో ప్రముఖ పరిశ్రమ గ్రీన్ టెక్ వారి సహాకారంతో ఏర్పాటు చేశారన్నారు. పట్టణంలో దాదాపు 9.5లక్షల రూపాయలతో 39సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. 39 సిసి కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు. పోలీస్ యంత్రాంగం వారివారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంను సిసికెమెరాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తద్వారా దొంగతనాలు తగ్గుముఖం పడుతాయని అన్నారు. నాయుడుపేటలో వీటి ద్వారా నేరాలను అదుపులోకి తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్ పి బాబుప్రసాద్, గ్రీన్ టెక్ పరిశ్రమ అధినేత మాథ్యూఛిన్, పవన్ కుమార్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY