జననేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

0
116

Times of Nellore ( Rajahmundry ) – జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మంగళవారం రోజు వచ్చిన జనసముద్రం బుధవారం రోజు కూడా కొనసాగింది. తమ బిడ్డను చూడటానికి తల్లిదండ్రలు, మనుమడితో మాట్లాడటానికి అవ్వాతాతలు, అన్నతో కష్టాలు చెపుకోవడానికి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు తరలివచ్చారు. వారందరికి భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రైల్వే ష్టేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్‌, లక్ష్మీనరసింహా నగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

SHARE

LEAVE A REPLY