వైసీపీలో చేరిన టీడీపీ నేత!

0
63

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కురెళ్ళ రామ్‌ప్రసాద్‌ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో పాటు ఉప ముఖ్యమంత్రి నానికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు కురెళ్ళ రామ్‌ప్రసాద్‌ తెలిపారు. రూరల్‌ మండలం శనివారపుపేటలోని పార్ధసారథి కల్యాణ మండపంలో ఆదివారం వందలాదిమంది కార్యకర్తలతో కలిసి నాని సమక్షంలో పార్టీలో చేరారు. నాని వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో నాని మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలను పక్కన పెట్టి పేదవాడికి అండగా ఉండి ఆదుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. ఎన్నికల వరకే పార్టీలన్నారు. తాము సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తామన్నారు. ఎంతోమంది వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి నానిని, కురెళ్ళ రామ్‌ప్రసాద్‌ను పార్టీ కార్యకర్తలు గజమాలతో అభినందించారు. కార్యక్రమంలో పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎంఆర్డీ బలరామ్‌, బొద్దాని శ్రీనివాస్‌, అంబికా రాజా, మంచెం మైబాబు, మున్నుల జాన్‌ గురునాథ్‌, మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY