వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌

0
154

Times of Nellore (Tadepalli)#కోట సునీల్ కుమార్ # – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌ శాసనసభాపక్ష నేతగా ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభపక్ష నేతగా పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనను శాసభసభపక్ష నేతగా పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. మిగతా సభ్యులంతా ఆమోదించారు. తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నట్లు ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, పార్థసారధి తెలిపారు.

ఈరోజు 11.32 గంటలకు అక్కడే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారు. జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం విజయవాడలో 30వ తేదీన జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు.

SHARE

LEAVE A REPLY