వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

0
135

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్సార్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో ఈ పేరుపై అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY