అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్‌ జగన్‌

0
160

Times of Nellore (Hyd) #కోట సునీల్ కుమార్ # – మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్‌ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.

SHARE

LEAVE A REPLY