పరీక్ష ముగిసిన గంటలోనే ఫలితాలు

0
739

Times of Nellore (బెంగళూరు)# కోట సునీల్ కుమార్ #: పరీక్ష ముగిసిన గంటలోనే ఫలితాలను ప్రకటించడం ద్వారా బెంగళూరు యూనివర్శిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరు విశ్వవిద్యాలయ పరిధిలోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కళాశాల బి-టెక్‌ విభాగంలోని అన్ని కోర్సుల మొదటి సెమిస్టర్‌ ఫలితాలను ప్రయోగాత్మకంగా గంటలోనే ప్రకటించారు. డిసెంబరు 20న ప్రారంభమైన పరీక్షలు 29వరకు జరిగాయి. 30న వాల్యుయేషన్‌ జరిగింది. దాదాపు 500మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 5వేల ప్రశ్నాపత్రాలను నిర్ణీత అవధిలో శుక్రవారం సాయంత్రం పూర్తి చేశారు. అనంతరం ఫలితాలను డీ కోడ్‌ చేసి థియరీతో కలిపి గంటలోపే ప్రకటించడంతో విద్యార్థులు ఆనంద పరవశులయ్యారు.

SHARE

LEAVE A REPLY