భార్య, కూతుర్ని రైల్వే స్టేషన్ లో వదిలేసాడు

0
251

Times of Nellore (Visakha)  # కోట సునీల్ కుమార్ # – తాళికట్టిన భార్యను, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను ఓ ప్రబుద్ధుడు రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆ బాధితురాలు శనివారం విశాఖ మహారాణిపేటలో భర్త ఇంటి వద్ద ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని బచేలిలో రైల్వేశాఖలో పని చేస్తున్న సందీప్‌కి ఏలూరు శాంతినగర్‌కు చెందిన జానకితో 2008లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా పెళ్లి సమయంలో జానకి తల్లిదండ్రులు భారీగా కట్నం కూడా ముట్టచెప్పారు. రైల్వే ఉద్యోగి అయిన సందీప్‌ విధుల్లో అలసత్వం కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు..జానకిని కొట్టడం, మానసికంగా హింసించడంతో ఆమె తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయింది.

SHARE

LEAVE A REPLY